నమస్తే శేరిలింగంపల్లి: హాఫిజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం విలేజ్ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ ఈదమ్మ తల్లి, శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానానికి బీ ఆర్ ఎస్ హాఫిజ్ పెట్ 109 డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ రూ. ఒక లక్ష విరాళం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కును దేవస్థాన కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దొంతి శేఖర్, వార్డ్ మెంబర్ కే వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, వీరేందర్, శ్రీధర్, శ్రీనివాస్, నరసింహా, భాస్కర్, రాజు, గ్యానేశ్వర్, పాల్గొన్నారు