నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు సిరి మువ్వ కూచిపూడి డాన్స్ అకాడమీ గురువర్యులు అను వడ్ల శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
మూషిక వాహన, బ్రహ్మంమొక్కటే, చక్కని తల్లికి చాంగ్ భళా, పుష్పాంజలి, ముద్దుగారే యశోద, చంద్ర చూడరా, శ్రీ విజ్ఞ రాజాం భజే, గౌరీ కళ్యాణం మొదలైన అంశాలను ప్రదర్శించారు. పాల్గొన్న కళాకారులు తాన్విక, చందాన, జోషిని,, యోగితా, మహాశ్రీ, యశస్వి, హర్షిత, జస్మితా, సుదీప్తి, జాహ్నవి మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు. కవయిత్రి హైకోర్టు న్యాయవాది కళ తాటికొండ విచ్చేసి కళాకారులను అభినందించారు.