ఆరోగ్యం బాగుంటే ఏదయినా సాధించవచ్చు: బిఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి బండి రమేష్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, హైదర్ నగర్ ఆదర్శ్ నగర్ లో ఎస్ ఎస్ క్లినికల్ డయాగ్నోస్టిక్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని బిఆర్ ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి బండి రమేష్ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు.

ఉచిత వైద్య శిబిరంలో..

ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదయినా సాధించవచ్చని, ప్రతి ఒకరు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ క్లినికల్ ఎండీ రమేష్ , బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు కోమండ్ల శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, సుదర్శన్, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here