శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మోదీ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక, ప్రమాదకరమైన అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలనే కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పం అని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఈ చట్టవిరుద్ధ చర్యలకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భయపడరని అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై పెట్టిన కేసులు అసమ్మతి స్వరాలను బెదిరించడానికి, అణచివేయడానికి ఉద్దేశించిన వర్గవాద సాధనాలు తప్ప మరొకటి కాదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం చెప్పు చెత్తల్లో ఈడీ కక్షపురితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని, ఈడీ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయని, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను అణచివేయడానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, గాంధీ కుటుంబాన్ని కల్పిత కేసులతో లక్ష్యంగా చేసుకుంటున్నారని, నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించబడినవని, కాంగ్రెస్ నాయకత్వంపై ప్రతీకారంలో భాగమని అన్నారు. మా పార్టీ మా సొంత ప్రచురణకు నిధులు ఇస్తే మనీలాండరింగ్ కేసు ఎలా నమోదు చేయవచ్చు అని ప్రశించారు. దేశవ్యాప్తంగా కులగణన కోసం రాహుల్ గాంధీ డిమాండ్ చేయడంపై కేంద్ర ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, మైనారిటీలు, మహిళలు, యువ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, సేవాదళ్ నాయకులు పాల్గొన్నారు.