- చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయే పద్ధతులను వివరించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమం సుభాష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. కమిటీల విషయంలో మార్గదర్శకం చేసి, పార్టీని ముందుకు నడిపే దశ దిశలను నిర్దేశించారు. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాష్ట్ర నియోజకవర్గ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి టిడిపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి కట్టా వెంకటేష్ గౌడ్ పేరుపేరునా కృతజ్ఞభినందనలు తెలిపారు.