- రోడ్డు మొత్తం వ్యాపించిన మురుగు
- పట్టించుకోని సంభందిత అధికారులు
- సమస్యను పరిష్కరించాలని పోరెడ్డి బుచ్చిరెడ్డి డిమాండ్
నమస్తే శేరిలింగంపల్లి : జిహెచ్ఎంసి , హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ అధికారుల సమన్వయ లోపం వల్ల తార నగర్ కాలనీ లో డ్రైనేజీ ఏరులై పారుతున్నది. అక్కడ దుర్గంధపూరిత వాతావరణం ఏర్పడుతున్నది, రహదారి పొడవునా మురుగు ప్రవహిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ , చందా నగర్ డివిజన్ , తార నగర్ కాలనీ నుంచి గోపీనాథ్ కాంప్లెక్స్ రోడ్డు వరకు ఇదే పరిస్థితి కొన్ని రోజులగా నెలకొంటుంది. స్థానికులు సమాచారం అందించినా, సంబంధిత (హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి) అధికారికి ఫోన్ చేసిన మా పరిధిలోకి జిహెచ్ఎంసి పరిధిలోకి వస్తుందని చేతులెత్తేశారు. వెంటనే డ్రైనేజీ లైన్ లో నిండిపోయిన చెత్తను తీసివేసి , రోడ్లను శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బిజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజేపీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి , బీజేపి చందానగర్ డివిజన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్ , నర్సింహా రెడ్డి , బీజేవైఎం నాయకులు కిరణ్ , వినోద్ , కాలనీ వాసులు సందీప్ రెడ్డి , గోవింద్, యుగేందర్ , వెంకటేశ్వర్ రావు , గురువయ్య , లక్ష్మణ్ పాల్గొన్నారు.