సైబరాబాద్ పరిధిలో మెగా డ్రంక్ అండ్ డ్రైవ్

  • 283 కేసులు నమోదు

నమస్తే శేరిలింగంపల్లి : సైబరాబాద్ పరిధిలో శనివారం మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 283 కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 6 చోట్ల, 120 మంది ట్రాఫిక్ సిబ్బందితో డ్రైవ్ నిర్వహించారు. వీరిని కోర్ట్ లో హాజరు పరిచి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరనున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ఈ డ్రైవ్ లో 210 ద్విచక్ర వాహనాలు , 63 ఫోర్ వీలర్ , 7 త్రి వీలర్ , 3 హెవీ వెహికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 3122 కేసులు నమోదు చేశామని, 1586 మందిని కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. అందులో 1549 మందికి 50,77,800/- జరిమానా , 35 మందికి జరిమానా, జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. ఒకరికి అత్యధికంగా 6 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here