- రూ. ఒక 1 కోటి 50 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం
- పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాలలో రూ. ఒక 1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనులకు మండల విద్యాధికారి వెంకటయ్య, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు.
అధునాతన సకల హంగులతో, కొత్త సొగసును సంతరించుకుంటున్నాయని తెలిపారు. ప్రయివేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే క్రమంలో మన ఊరు మన బడి కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యుఐడిసి ఏఈ శ్యామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాజ్ బాబు , గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెన్నం రాజు, సత్యనారాయణ, సంపత్,రమేష్, సతీష్, యాదగిరి, సల్లావుద్దీన్,అక్బర్, అంజమ్మ, సుధీర్, కాదర్ ఖాన్, మసూద్ అలీ, సుగుణ, బాలమణి, రాధ, మరియు విద్య కమిటీ ప్రతినిధులు కృష్ణ గౌడ్, సురేష్, నరేందర్, దేవేందర్, నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.