నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి లో స్థానికంగా నల్లగండ్ల వెజిటబుల్ మార్కెట్ జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్ దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.

నల్లగండ్ల వెజిటబుల్ మార్కెట్ జనరల్ సెక్రటరీ షేక్ అహ్మద్ చిత్రపటానికి పూలమాల వేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
తన ఆత్మకి శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికీ అన్నదాన కార్యక్రం నిర్వహించగా.. అయన పాల్గొని భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, మార్కెట్ ప్రెసిడెంట్ వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు రాఘవ రావు, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, రాజు, శీను, అస్లాం, అజీమ్, గోపాల్ యాదవ్, రవి మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
