- స్థూపం, విగ్రహావిష్కరణ స్థలాలను పరిశీలించిన ఎంసీపీఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కిరణ్ జిత్ సింగ్ షేఖాన్


నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ క్రాస్ రోడ్ లోని అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ 51 అడుగుల స్మారక స్తూపాన్ని, ముజాఫర్ అహ్మద్ నగర్ లో కామ్రేడ్ తాండ్ర కుమార్ విగ్రహావిష్కరణ స్థలాన్ని ఎంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కిరణ్ జిత్ సింగ్ షేఖాన్ (పంజాబ్) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ తాండ్ర కుమార్ ఎం సి పి ఐ(యు) ఏర్పాటు నుండి 40 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ఉండి పోరాటాలు నిర్వహించే వారని గుర్తు చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు మియాపూర్ ప్రాంతంలో వేలాదిమంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కల్పించి అనేక బస్తిలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశ స్ఫూర్తిని కొనియాడుతూ యంసిపిఐ (యు) మరిన్ని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శివర్గ సభ్యులు లాసాని రాజు, పల్లె మురళి ఇ.దశరథ్ నాయక్, మియాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు భూసాని రవి, సభ్యులు ఎం రాములు, ఆకుల రమేష్, రవికాంత్ ఉన్నారు.