- శాసన సభలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని పరిసర ప్రాంతాలలో హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ పై శనివారం శాసన సభలో జరిగిన చర్చలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ప్రసంగించారు. ఇటీవల డిసెంబర్ 9న ప్రారంభించిన మెట్రో రైల్ మార్గం రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు రూ. 6, 250 కోట్లతో మెట్రో మార్గం నిర్మాణ పనులకు ముఖ్య మంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మియాపూర్ నుంచి భేల్ వరకు మెట్రో రైల్ మార్గం విస్తరణ నిర్మాణం పనులు వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మియాపూర్ నుండి భేల్ వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ పనులు 2వ దశ లో తీసుకుంటామని తెలిపారు.