ఉత్కంఠ పోరులో టీఎస్ సీఎస్ జోరు – 75 పరుగులతో అదరగొట్టిన వంశీ మోహన్ రెడ్డి

  • T-20 ఫ్రెండ్‌షిప్ కప్ లో హోరాహోరీగా పోటీపడిన టీఎస్ సీఎస్,  హెచ్ఎండబ్ల్యుఎస్ ఎస్ బి జట్లు
  • 20 ఓవర్లలో 148/8 స్కోర్ చేసిన టీఎస్ సీఎస్
  • 4 పరుగుల తేడాతో విజయం
  • 4 ఫోర్లు, 3 సిక్స్ లతో మెరిసిన సి. వంశీ మోహన్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ (టీఎస్ సీఎస్) జట్టు హెచ్ఎండబ్ల్యుఎస్- ఎస్ బి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది. వాటర్ వర్క్స్ అంబర్‌పేట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ జట్ల మధ్య పోటీ జరగగా… మొదట బ్యాటింగ్ చేసిన టీఎస్ సీఎస్ 20 ఓవర్లలో 148/8 స్కోర్ చేసింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన హెచ్ఎండబ్ల్యుఎస్- ఎస్బి జట్టు 20 ఓవర్లలో 145/6 స్కోర్ చేసింది. రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరులో టీఎస్ సీఎస్ 4 పరుగు తేడాతో విజేతగా నిలిచింది. టీఎస్ సీఎస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సి. వంశీ మోహన్ రెడ్డి 48 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు.

75 పరుగులతో మెరిసిన సి. వంశీ మోహన్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here