ప్రతి కమ్యూనిటీల్లో 5కె రన్ నిర్వహించాలి

  • రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఏడో ఎడిషన్ 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసు
  • సేవా భారతి ఆధ్వర్యంలో వేడుకగా రన్ .. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
  • ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైశ్వాల్
రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఏడో ఎడిషన్ 5k రన్ ను జెండా ఊపి ప్రారంభిస్తున్న తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసు

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ లోని పైప్ లైన్ రోడ్ లో సేవా భారతి ఆధ్వర్యంలో (రన్ ఫర్ గర్ల్ చైల్డ్)7th ఎడిషన్ 5k రన్ నిర్వహించారు. ఈ రన్ ను తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసు జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ క్రీడాకారిణి నైనా జైశ్వాల్, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఏడో ఎడిషన్ 5k రన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న నైనా జైశ్వాల్

ఈ సందర్బంగా మొదటి స్థానాలలో నిలిచిన వారికి, పాల్గొన్న ప్రతి ఒక్కరిని మెడల్స్ తో సత్కరించారు. 5k రన్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ వాసు, బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. సురక్షితం గా ఉండే వాతావరణం, చక్కని చదువు , ఆరోగ్యకరమైన జీవితం గడపగలిగే అవకాశం ఉంటే ఆడపిల్లలు తల్లులుగా, వ్యాపార వేత్తలుగా, గృహిణులుగా, రాజకీయ నేతలుగా ఎదిగి దిశానిర్దేశం చేసే స్థాయికి చేరుకుంటారని, ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఇవన్నీ లభించడం లేదన్నారు. ఇలాంటి రన్ లు ప్రతి కమ్యూనిటీ ల్లో నిర్వహించి వారిలో చైతన్యం తేవాలని నిర్వాహకులను కోరారు. ఇందుకోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఎన్నో విషయాలను మాట్లాడి, నారి శక్తి అవసరం ఏ మేరకు ఉందో అర్థమయ్యేలా చేసిన నైనా జైశ్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చంద్ర భూషణ్, లక్ష్మణ్ కుమార్, పృథ్వి గౌడ్, సంజయ్, కృష్ణ రెడ్డి, సత్యనారాయణ, సుబ్బారావు, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

5k రన్ లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here