శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మహర్షి దయానంద సరస్వతి జయంతిని పురస్కరించుకొని గురువారం ఉదయం 11 గంటలకు స్థానిక మియాపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అట్టేపల్లి రామప్రభు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు,పెన్సిళ్లు, షార్ప్‌నర్లు, స్కేల్స్ తదితర పరీక్షా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి, రాబోయే కాలంలో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్పి టీమ్ సభ్యులతో పాటు ముఖ్య అతిథిగా స్థానిక నాయకుడు ఓంప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. పాఠశాల హెడ్మాస్టర్ వసుంధర దేవి, ప్రీ-ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ హుస్సేన్ పాల్గొన్నారు.






