దోమ‌ల మందు పేరిట పిచ్చి ర‌సాయ‌నాల పిచికారీ: మన్నేపల్లి సాంబశివరావు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): GHMC ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు చేరువ అవ్వటం కోసం మేమున్నాం అంటూ ముందుకు వస్తున్న కొందరు నాయకుల ప్ర‌వ‌ర్త‌న వింతగా ఉంద‌ని, దోమల నివారణ రసాయనాలు పిచికారి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని శేరిలింగంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నేపల్లి సాంబశివరావు అన్నారు. ఇన్నాళ్లు ప్రజల బాగోగులు పట్టించుకోని అవకాశవాదులు ఇప్పుడు తామేదో ఉద్దరిస్తామనే భ్రమలో రోజుకో నాయకుడు వచ్చి దోమల ముందు పేరుతో పలు రకాల రసాయనాలు పిచికారి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. డ్రైనేజ్ క్లీనింగ్, కాలనీలలో పేరుకుపోయిన చెత్త, దుమ్ము ఎత్తివేత పనుల పేరుతో డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తున్నారు. ప్రజల అవసరాలు తీర్చాల్సిన మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ గా గెలిచిన నాయకులు చేయవలసిన పనులు ప్రజల బాగోగులు చూడవలసిన మునిసిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

మునిసిపల్ కు సంబంధం లేని వ్యక్తులు బయట వ్యక్తులు నకిలీ రసాయనాలు పిచికారి చేస్తుంటే ఎమ్మెల్యేగా ఉన్నత పదవిలో ఉండి రిబ్బన్ కటింగ్‌లు దోమల ముందు యంత్రాలను ప్రారంభించడం జరుగుతుంది. ఆయా పనుల్లో అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. బయట వ్యక్తులు పిచికారి చేసే రసాయనాల వల్ల ప్రజలకు ఏమైనా రోగాలు వ్యాపించి ఇబ్బందులు ఎదుర్కొంటే బాధ్యులు ఎవరని అనుమానం వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాలకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడ‌డం మంచిది కాదని హెచ్చరించారు. రకరకాల రసాయనాలు పిచికారి చేస్తుంటే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని, అధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here