నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ ఎన్నికల అధికారిగా తెలంగాణ స్టేట్ బార్ అసోసియేషన్ వైస్ చైర్మన్, హై కోర్ట్ న్యాయవాది కె.సునీల్ గౌడ్ నియామకమయ్యారు. బీసీసీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో సునీల్ గౌడ్ ను ఎన్నికల అధికారిగా నియమకాన్ని ఆమోదిస్తూ తీర్మానం చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.విజయానంద్ తెలిపారు. ఎన్నికల సంబంధిత వివరాలకోసం క్రీడాకారులు సునీల్ గౌడ్ ను సంప్రదించాలని సూచించారు.
