నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధి చందానగర్ లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉరిటీ వెంకట్రావు తన నివాసంలో జరిగిన సుదర్శన హోమం మహోత్సవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్ , నరేందర్ బల్లా, భాస్కర్, హరి పాల్గొన్నారు.