అంగన్ వాడి భవనాలకు అద్దెలు చెల్లించాలి

అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్స్ జెఏసి డిమాండ్

నమస్తే శేరిలింగంపల్లి : రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్ వాడి భవనాలకు అద్దెలు పెంచాలని, పెండింగ్ లో ఉన్న అద్దెలు చెల్లించాలని అంగన్ వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్స్ జెఏసి డిమాండ్ చేసింది.

అనంతరం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ విషయమై గతంలో డిప్యూటీ కలెక్టర్ కు శేరిలింగంపల్లి మండలం తహసీల్దార్ కు విన్నవించిన విషయం విడితమే.  అనంతరం వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 వేల మంది అంగన్ వాడీ ఉద్యోగులు పని చేస్తున్నారని , వీరంతా మహిళలు బడుగు, బలహీనవర్గాలకు చెందినవారేనని, గత 45 సంవత్సరాలకు పైగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేదలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు. కానీ వీరికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలేవి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని తెలిపారు.

తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ఉద్యోగులకు సకల సౌకర్యాలు అందిస్తున్నారని, అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కల్పించాలన్నారు. తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం రూ. 5 లక్షలు చెల్లించాలని, గత నిబంధనల ప్రకారం ఎస్ఎస్సి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం, సీనియారిటీ ప్రకారం వేతనం, 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన వేతనం అంగన్ వాడి టీచర్లకు రూ. 1,500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు 1.250, రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here