నమస్తే శేరిలింగంపల్లి: బీసీలు ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని బీసీ ఐక్యవేదిక చైర్మన్ భేరి రామచందర్ యాదవ్ అన్నారు. బీసీ కులాల ఐక్యవేదిక మూడవ సమావేశం కొండాపూర్ వంగూరు శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీల గురించి చర్చించారు.
బీసీ భవిష్య ప్రణాళిక గురించి హాజరైన బీసీలు చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 15 మంది ముఖ్య కార్యకర్తలతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని, అధికారమే అంతిమ లక్ష్యంగా 54% బీసీల కోసం ఐక్యవేదిక బలోపేతం చేసే దిశగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఎన్నికల కంటే ముందు భారీ ఎత్తున పదివేల బీసీలతో సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పారు.
పోలీస్ స్టేషన్లో కానీ ప్రభుత్వ కార్యాలయంలో, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టర్ ఆఫీసుల్లో బీసీలకు సహాయం చేద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, నరసింహ ముదిరాజ్ ఓ శ్రీనివాస్ యాదవ్, రమేష, మల్లేష్ యాదవ్, నరసింహ ముదిరాజ్, కుమార్ యాదవ్, సరోజినమ్మ, వెంకటమ్మ, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్ కే సాయన్న, గౌస్, వెంకట్, అరవింద్, కెవిఆర్ యాదవ్ పాల్గొన్నారు.