ప్రతి లేబర్ అడ్డా వద్ద చలివేంద్రాలు ప్రారంభించాలి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ లేబర్ అడ్డా వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిఆర్ ఎస్ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ రెడ్డి , కార్మిక నాయకులు సీతారామయ్య పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి లేబర్ అడ్డా వద్ద చలివేంద్రాలు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా నాయకులు సి శోభన్, సిఐటియూ శేరిలింగంపల్లి కార్యదర్శి కోంగరి కృష్ణ , మాణిక్యం , రూపులాల్ బహుజన నాయకుడు సీనియర్ పాత్రికేయులు అమృత, లేబర్ కార్మికులు చంద్రయ్య, మల్లయ్య, పోచయ్య పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో చలివేంద్రం ను ప్రారంభిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here