నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి డ్రైనేజీ, వర్షపు నీరు కలిసి ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరింది. సమాచారం అందుకున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాష ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకెపూడి గాంధీని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. తక్షణమే స్పందించిన గాంధీ సమస్యను సత్వరమే పరిష్కరించాలని జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ డిఈ రమేష్, ఏఈ ప్రతాప్ లు చాంద్ పాషతో కలసి సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుకున్న మురికినీటిని దగ్గరుండి తొలగింపచేశారు. ఈ సమస్య పట్ల వెంటనే స్పందించి పరిష్కరించినందుకు ప్రభుత్వ విప్ గాంధీ, షేక్ చాంద్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, రమణా నాయుడు, ధనంజయ్, మహేష్ గుడి కమిటీ ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
