ఘ‌నంగా మిరియాల ప్రిత‌మ్ జ‌న్మ‌దినం… పిఎస్ఎస్ ట్రస్టుకు రూ.75 వేల ఆర్ధిక సాయం…

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ యువజన నాయకులు మిరియాల ప్రీతమ్‌ జన్మదినం సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు మియాపూర్‌లోని పీఎస్ఎస్ ట్రస్ట్‌కు రూ. 75 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సంద‌ర్భంగా రాఘ‌వ‌రావు మాట్లాడుతూ పీఎస్ఎస్ ట్రస్ట్ నిరుపేద విద్యార్థుల‌కు ఉచిత విద్యాభోద‌న‌తో పాటు వారికి ఉపాధి క‌ల్పించేందుకు ఎంతో కోసం కృషి చేస్తోందని అన్నారు. 800 మంది పేద‌ విద్యార్థుల‌ అభ్యున్నతి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్న‌ పీఎస్ఎస్‌ చారిటబుల్‌ ట్రస్ట్ చైర్మ‌న్ శ్రీనివాస్‌కు త‌మ వంతు భాద్య‌త‌గా తోచిన స‌హ‌కారం అందించ‌డం జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో శ్రీనివాస్ మిరియాల‌ ప్రీత‌మ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మ ట్ర‌స్టు సేవ‌ల‌ను గుర్తించి చేయూతను అందించింద‌నందుకు మిరియాల రాఘ‌వ‌రావు, మిరియాల ప్రీత‌మ్‌ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

పిఎస్ఎస్ ట్రస్ట్ చైర్మ‌న్ శ్రీనివాస్‌కు రూ. 75 వేల చెక్‌ను అందజేస్తున్న మిరియాల రాఘవరావు, మిరియాల ప్రిత‌మ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here