శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘనంగా బీఎంఎస్ జెండావిష్కరణ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: భాగ్యనగర్ మున్సిపల్ జిహెచ్ఎంసి ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బీఎంఎస్ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్న శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. బీఎంఎస్ జోనల్ అధ్యక్షుడు జి.రాజేశ్వరరావు, జోనల్ కార్యదర్శి ఎ. గోపాలకృష్ణ ఆధ్వర్యంలో శుక్ర‌వారం బీఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల క‌ష్ట‌సుఖాల‌లో భాగం పంచుకునే ఏకైక యూనియ‌న్ బీఎంఎస్ అని అన్నారు. కార్మికుల హ‌క్కుల‌ను పొందాలంటే బిఎంఎస్ ద్వారానే సాధ్య‌మ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.కృష్ణ, ఎం.నర్సింగ్ రావు, కె.వెంకటేష్, ఆర్.విశ్వపతి,ఎ. రాజు,ఎం.ఈశ్వర్ రెడ్డి,బీఎంఎస్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఆవరణలో బీఎంఎస్ జెండాను ఆవిష్కరిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here