- భక్తి శ్రద్దలతో భక్తుల ప్రత్యేక పూజలు
నమస్తే శేరిలింగంపల్లి: హుడా కాలనీ చందానగర్ లో శ్రీ శ్రీ వాసవి మాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేదం మంత్రోచ్ఛరణల నడుమ విగ్నేశ్వర పూజ, పున్యాహ వచనం, మర్జనలు, వుర్తిక్ వర్ణనలు, దీక్ష ధారణ, అస్త్ర రజర్చన, ప్రధాన కుంబవహనఅకురారోర్పన, ధ్వజ రోహన, అఖండ దీపారాధన పూజలు ఘనంగా చేపట్టారు. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు హిందు ధర్మ పరిరక్షకులు, బ్రహ్మచారి, భారత ధర్మ దేవత బిరుదాంకితులు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ శివ స్వామీజీ సమక్షంలో పూజలు చేశారు.
భక్తులు పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు చేసి, తమను చల్లగా చూడాలని వేడుకున్నారు. 8వ తేదీ వరకు జరిగే ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని దేవి దేవతల అనుగ్రహం పొందగలరని ఆలయ కమిటీ పిలుపు నిచ్చింది.