నమస్తే శేరిలింగంపల్లి : శ్రీరాంప్రసాద్ దూబే కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడిగా కే.అనిల్ కుమార్ ముదిరాజ్, అధ్యక్షులుగా చిట్టా రెడ్డి ప్రసాద్ ఎన్నికయ్యారు. ఆదివారం ఈ మేరకు కాలనీ హనుమాన్ టెంపుల్ ఆవరణలో సమావేశమైన కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్ష, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు.
ప్రధాన కార్యదర్శిగా వెంకటస్వామి, ఉపాధ్యక్షులుగా రాయల ప్రవీణ్ కుమార్, మల్లికార్జున చారి, పిల్లి యాదగిరి, బ్రహ్మానందం, చీఫ్ అడ్వైజర్ గా శైలేష్ తివారి, రూపేష్ దూబే, పోచయ్య, లీగల్ అడ్వైజర్ గా రాజ్ కిరణ్ దుబే, జగదీష్, జై సెక్రటరీగా పి.కృష్ణ, ఆడిటర్ గా అప్సర్, హనుమాన్ గౌడ్ ఎన్నుకోబడ్డారు. కాలనీ పెద్దలుగా అంజయ్య ముదిరాజ్, చెన్నకేశవులు సాగర్, పిల్లి ఏకాంతం, పి.బాబు, డేవిడ్, మధు గౌడ్, లోకానందం, గట్టు రాజు ఎన్నికయ్యారు.