దోపిడి వ్యవస్థ నిర్మూలనకు లెనిన్ విధానమే మార్గం

  • ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్

నమస్తే శేరిలింగంపల్లి : మార్క్సిస్టు మహోపాధ్యాయులు, ప్రపంచ కార్మికవర్గ మార్గ నిర్దేశి, పెట్టుబడిదారి, సామ్రాజ్యవాదుల గుండెల్లో సింహం కామ్రేడ్ వీ ఐ లెనిన్ శత వర్ధంతి కార్యక్రమం ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎం ఏ నగర్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ లెనిన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

లెనిన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న వణం సుధాకర్ తదితరులు

అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచ మార్క్సిస్టు మహోపాధ్యాయులలో కార్మిక వర్గ దృక్పథంతో పెట్టుబడిదారీ, సామ్రాజవాదల నిర్మూలనల పై పోరాడి సోషలిస్టు ఆ రాజ్యస్థాపనను ఏర్పాటుచేసిన గొప్ప కార్మిక వర్గ సైతాంతిక మేధావి కామ్రేడ్ వి ఐ లెనిన్ అని అన్నారు. రష్యన్ సోవిట్ యూనియన్ ఏర్పర్చి ఆ దేశంలో సమానత్వాన్ని స్థాపించడమే కాకుండా అభివృద్ధి అవుతున్న ప్రపంచంలోని అన్ని దేశాలకు మార్గం నిర్దేశాన్ని కామ్రేడ్ లెనిన్ నాయకత్వంలో సహకరించబడిందని గుర్తు చేశారు. ఎంసిపిఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు. రాష్ట్ర నాయకులు కుంభం సుకన్య తాండ్ర కళావతి, పల్లె మురళి, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు యార్లగడ్డ రాంబాబు, డి మధుసూదన్, మియాపూర్ డివిజన్ నాయకులు జి శివాని, దేవనూరి నర్సింహా, డి చందర్, పార్టీ నాయకులు ఆకుల రమేష్, ఇందిరా, డప్పు రాజు, వెంకటేష్ పాల్గొని కామ్రేడ్ లెనిన్ కు ఘన నివాళి అర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here