నమస్తే శేరిలింగంపల్లి : శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలను కొండాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, చందానగర్, హఫీజ్ పేట్, మియాపూర్, ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండ ,డివిజన్లలోని దేవాలయాలలో రాములవారి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.