- పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం.. 1500 మంది వరకూ వచ్చిన భక్తజనం
- ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆరంభ టౌన్షిప్ లో శ్రీరామనవమి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అసోసియేషన్ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా.. దాదాపు 1500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ రాష్ట్ర యువజన నాయకులు అనిరుద్ యాదవ్, ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రాజేష్, శ్రీరామనవమి కమిటీ సభ్యులు అరుణ శ్రీ, దాసరి సరిత, రెహానా బేగం, పెద్ది వెంకటేశ్వర్లు గుప్తా, మహేష్, సాయిరాం,మౌలిక, శ్వేత, సౌజన్య, విజయలక్ష్మి, విశాలాక్షి, విక్రమ్ యాదవ్, నాగరాజు, జనార్ధన్, రాందాస్, శ్రీనివాస్ ఏర్పాట్లను పరిశీలించారు.
