ఆరంభ టౌన్షిప్ లో శ్రీరామనవమి కళ్యాణం.. ఏర్పాట్ల పరిశీలన

  • ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, కమిటీ సభ్యులు
ఆరంభ టౌన్ షిప్ లో శ్రీరామ నవమి ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, కమిటీ సభ్యులు

నమస్తే శేరిలింగంపల్లి : ఆరంభ టౌన్షిప్ లో శ్రీరామనవమి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించనున్నారు. ఇందులో భాగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆ ఏర్పాట్లను అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. దాదాపు 3000 మందికి సరిపడే విధంగా భోజనాలు.. వందలాది మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, మధుసూదన్ రెడ్డి, రాజేష్, శ్రీరామనవమి కమిటీ సభ్యులు అరుణ శ్రీ, దాసరి సరిత పెద్ది వెంకటేశ్వర్లు గుప్తా, మహేష్, బసవయ్య, శ్రీనివాస్ ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here