దేశానికి, తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీ రామ రక్ష: ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలు..పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపు
  • మాదాపూర్ ప్రగతి నివేదిక విడుదల 
మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ఆదిత్య నగర్ లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు. దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ కేవలం బీఆర్ ఎస్ అని, బీఆర్ ఎస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కార్యకర్తలే పార్టీకి పట్టు కొమ్మలని పేర్కొన్నారు. బీఆర్ ఎస్ పార్టీ పదవులు పొందిన వారు క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా పని చేయాలని, పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేసి పార్టీ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్/ఏరియా కమిటీ సభ్యులు, బస్తి అధ్యక్షలు, మహిళ నాయకులు, పార్టీ ప్రధాన, అనుబంధ కమిటీలు, బస్తీ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాదాపూర్ డివిజన్ ప్రగతి నివేదికను ప్రభుత్వ విప్ గాంధీ ప్రవేశపెట్టారు.

    • సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ ప్రగతి నివేదిక
వార్డు నంబర్ 107
డివిజన్ ఓటర్ల వివరాలు
 స్త్రీలు: 30490
 పురుషులు: 39386
 ఇతరులు: 14
 పోలింగ్ కేంద్రాల సంఖ్య: 59
 మొత్తం ఓటర్ల సంఖ్య: 69890
అభివృద్ధి పనుల వివరాలు
 382 కోట్ల 92 లక్షల 16 వేల 284 రూపాయల నిధులతో డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు.
 అభివృద్ధి పనుల వివరాలు
221 కోట్ల 94 లక్షల 95 వేల రూపాయల జీహెచ్ఎంసీ నిధులతో డివిజన్ లోని కాలనీ లలో, బస్తీలలో కల్పించబడిన మౌలిక వసతులు వివరాలు
క్రమ సంఖ్య             వర్గం              మొత్తం పనులు
సంఖ్య            అంచనా వ్యయం
1 బీటీ రోడ్డు              67              4455.52
2 సీసీ రోడ్డు              250            7308.22
3 యూజీడీ              149            2645.89
4 కమ్యూనిటీ హాల్/

వార్డు కార్యాలయం

నిర్మాణాలు              2             59.90
5 ఫుట్‌పాత్                21           536.90
6 లేన్ మార్కింగ్స్        2             21.00
7 పార్క్స్                   3             12.00
8 డీసిల్టింగ్               14            156.15
9 కాంపౌండ్ వాల్         8            192.40
10 స్ట్రామ్ వాటర్ డ్రైన్

(వరద నీటి కాలువ)    61          2449.93
11 ఇతర పనులు (మ్యాన్ హోల్స్ ఫై కప్పులు మరియు కాలువలు

శుభ్రపరుచుట)        231         4318.94
12 శ్మశాన వాటికలు         5          8.10
మొత్తం                     813         22194.95
విధి దీపాల నిర్వహణ:
 విధి దీపాల నిర్వహణకు గాను 2 కోట్ల 33 లక్షల 72 వేల రూపాయల (2, 33, 72,000) నిధులతో విధి దీపాల నిర్వహణ.
మిషన్ భగీరథ
 కొత్తగా దాదాపు 6188 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
 డివిజన్ లో ఇప్పటి వరకు దాదాపు 14238 మంచినీటి కనెక్షన్లు కల్పించారు.
 డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 54 కోట్ల 82 లక్షల రూపాయలతో మంచినీటి వసతి.
 డివిజన్ లో ఇప్పటి వరకు మొత్తం 7 కోట్ల 67 లక్షల రూపాయలతో యూజీడీ వసతులు ఏర్పాటు చేశారు.
 రోజు విడిచి రోజు ఒక గంట వరకు నీటి సరఫరా అవుతున్నది.
 ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా.

సమావేశంలో మాట్లాడుతున్న చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి

రిజర్వాయర్ల నిర్మాణం :
 హడ్ కో ప్రాజెక్ట్ కింద 54 కోట్ల 65 లక్షల రూపాయలతో దాదాపు 20 కిలోమీటర్లు కొత్త పైపు లైన్లను వేశారు.
 అయ్యప్ప సొసైటీ (GLSR /ELSR) లో 42 కోట్ల 40 లక్షల రూపాయలతో 4 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించారు.
 కల్వెరీ టెంపుల్ వద్ద (ELSR) 12 కోట్ల 25 లక్షల రూపాయలతో 2 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్ నిర్మించారు.
సుందరీకరణ పనులను చేపట్టిన చెరువులు
 1 కోటి 9 లక్షల రూపాయలతో తుమ్మిడి కుంట చెరువు అభివృద్ధి
 మీది కుంట
 మొండికుంట
లింక్ రోడ్స్ :
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా ప్రత్యామ్న్యాయ రోడ్ల నిర్మాణం.
(29, 11, 00,000) 29 కోట్ల 11 లక్షల రూపాయలతో అభివృద్ధి:
 వెస్టిన్ హోటల్ నుండి మాదాపూర్ మెయిన్ రోడ్ వరకు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి
 నోవాటెల్ నుండి ఆర్టీఏ ఆఫీస్ వరకు 5 కోట్ల 49 లక్షల రూపాయలతో అభివృద్ధి
 నిజాంపేట్ X రోడ్ నుండి హైటెక్స్ జంక్షన్ వరకు వీఐఏ వసంత్ నగర్ మరియు ఎన్ఏసీ 6 కోట్ల 40 లక్షల రూపాయలతో అభివృద్ధి
 ఎన్ఏసీ నుండి కేపీహెచ్ బీ రోడ్ వరకు 5 కోట్ల 69 లక్షల రూపాయలతో అభివృద్ధి
 మిస్సింగ్ లింక్ రోడ్ కారిడార్ :66 , న్యూ అల్లాపూర్ నుండి 100 ఫీట్ రోడ్ అడ్జసెంట్ తో సున్నం చెరువు , నాలుగు లేన్ ల రోడ్ 9 కోట్ల 53 లక్షల రూపాయలతో అభివృద్ధి.
కంటి వెలుగు :
1. రెండవ విడత కంటి వెలుగు పధకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పటి వరుకు 5315 మంది కంటి పరీక్షలు జరిపి 726 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణి చేయడం జరిగింది. వైద్యుల సూచనల మేరకు ఇంకా 492 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉంది.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం
 కళ్యాణ లక్ష్మీ – 230
 షాదీ ముబారక్ -488
మొత్తం 718 మంది లబ్దిదారులకు (6,58,44,284) 6 కోట్ల 58 లక్షల 44 వేల 284 రూపాయలు ) అందించడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్/ ఎల్వోసీ)
 లబ్ధిదారుల సంఖ్య – 131 (93, 90,000) 93 లక్షల 90 వేల రూపాయలు అందించడం జరిగింది.
పింఛన్లు
 వృధ్యాప్య పింఛన్లు – 90
 వితంతువు పింఛన్లు – 89
 వికలాంగుల పింఛన్లు – 28
 ఒంటరి మహిళా పింఛన్లు – 21
 మొత్తం పింఛన్లు – 228
దళిత బంధు :
 దళిత బంధు పధకం ధ్వారా దళిత కుటుంబాలకి ఉపాధి అవకాశాల
కొరకు ఒకొక్కరికి 10 లక్షల చొప్పున పది మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేయడమైనది .
CDP ఫండ్స్ :
CDP ఫండ్స్ కింద 1 కోటి 2 లక్షల 15 వేల రూపాయల నిధుల
ద్వారా చేపట్టిన పనులు.
 కావూరి హిల్స్ వద్ద బోర్ వెల్ కొరకు 2 లక్షల 50 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 ఖానమెట్ అయ్యప్ప సొసైటీ లో UGD పైప్లైన్ కొరకు 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 శ్రీ స్వామి అయ్యప్ప సొసైటీ లో సెవెరేజ్ లైన్స్ కొరకు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 ఆదిత్య నగర్ లోని మెయిన్ రోడ్ నుంచి ఈద్గా రోడ్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 ఆదిత్య నగర్ లోని బేగం షాహెబా మస్జీద్ దగ్గర సీసీ రోడ్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 డివిజన్ లో సీఆర్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ వద్ద సీసీ రోడ్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 డివిజన్ లో హెల్త్ సెంటర్ నుండి సీఆర్ ఫౌండేషన్ వరకు సీసీ రోడ్ నిర్మాణం కొరకు 3 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 డివిజన్ లోని బిక్షపతి నగర్ వద్ద నిర్మించిన సీసీ డ్రైన్ నిర్మాణం కొరకు 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 డివిజన్ లోని గోకుల్ చౌరస్తా వద్ద 11 కేవీ పోల్ షిఫ్టింగ్ కొరకు 95 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 సుభాష్ చంద్ర బోస్ నగర్ లో 100 ఎంఎం డయా డిఐ వాటర్ సప్లై కొరకు 6 లక్షల 10 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 SC బస్తి లో 100 MM DIA DI వాటర్ సప్లై కొరకు 2 లక్షల 60 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 నవభారత్ నగర్ , వడ్డెర బస్తి మస్తాన్ నగర్ సీసీ కెమెరాల కొరకు 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 డివిజన్ లోని శిల్ప పార్క్ వద్ద పార్క్ డెవలప్మెంట్ కొరకు 14 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 సుభాష్ చంద్ర బోస్ నగర్ సీసీ కెమెరాల కొరకు 3 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
DMF ఫండ్స్ :
DMF ఫండ్స్ కింద 95 లక్షల రూపాయల నిధుల ద్వారా చేపట్టిన పనులు.
 గుట్టల బేగంపేట్ బెవెరీ హిల్స్ వద్ద సీసీ రోడ్ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 శ్రీ స్వామి అయ్యప్ప కో – ఆపరేటివ్ హోసింగ్ సొసైటీ UGD పనుల నిర్మాణానికి 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 మండల్ ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 ఇజ్జాత్ నగర్ లోని అపర్ణ ఆర్చిడ్స్ వద్ద BT రోడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 ఇజ్జాత్ నగర్ లో 100 MM DIA మంచినీటి మెయిన్ లైన్ నిర్మాణానికి 4 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
 గుట్టల బేగంపేట్ లో మంచినీటి లైన్ల నిర్మాణానికి 6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
SDF ఫండ్స్ :
1. SDF ఫండ్స్ ద్వారా 50 లక్షల రూపాయల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించడమైనది.
 పార్కుల అభివృద్ధి :
 మాతృశ్రీ నగర్ లో థీమ్ పార్క్ కొరకు 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు.
బస్తి దవాఖాన:
 మాదాపూర్ డివిజన్ పరిధి లోని గోకుల్ ప్లాట్స్ , చంద్ర నాయక్ తండా లో బస్తి దవాఖాన ఏర్పాటు చేయంచి పేదలకు ప్రతి రోజు 200 మందికి పైగా బీపీ, షుగర్ మరియు ఇతర రక్త పరీక్షలు లాంటి సేవలను ఉచితంగా అందిస్తున్నారు.
 గర్భిణీ స్త్రీలకు 9 నెలలు నిండే వరుకు వారికి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారు.
 చంటి పిల్లలకు ప్రతి బుధవారం, శనివారం ఉచితంగా టీకాలు వేస్తున్నారు.
చేపట్టవలసిన పనులు :
 ఇజ్జాత్ నగర్ లో బాక్స్ డ్రైన్ మరియు కల్వర్ట్ నిర్మాణం

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here