
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తారా నగర్ లోని తుల్జా భవాని ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు వైభవంగా కొనసాగాయి. అమ్మవారు బుధవారం శ్రీ లలితా దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రకరకాల గాజులతో చేసిన అమ్మవారి అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. అదేవిధంగా గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలోనూ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బుధవారం అమ్మవారు శ్రీ లలితా దేవి అవతారం లో పూజలు అందుకున్నారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.






