దాత‌లు ముందుకు వ‌చ్చి ర‌క్త‌దానం చేయాలి

  • ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద AR ఫౌండేషన్ ఛైర్మెన్ రేవంత్ రాజ్ జన్మదినం సందర్భంగా AR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ AR ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త నిల్వలను పెంచడానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయ‌డం సంతోషకరమని అన్నారు.

ర‌క్త‌దాన శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్ లలో ర‌క్తం నిల్వలు పెంచుకోవడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాల‌ని అన్నారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న‌ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజాంపేట్, నిపుణ్ నెట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులను ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగాఅభినందించారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినదించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ తెరాస అధ్య‌క్షులు మారబోయిన రాజు యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్,హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్‌, తెరాస నాయకులు పద్మారావు, చింతకింది రవీందర్, నరేష్, జగదీష్, లింగం శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here