- మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతేనని, సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ కార్యాలయంలో 22వ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొని శ్రీ కృష్ణ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం శ్రీ కృష్ణ యూత్ మాజీ అధ్యక్షులను వారు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు బాలకృష్ణ, శివ కుమార్ గౌడ్, పి.యాదగిరి, లక్ష్మణ్, విజేందర్ రెడ్డి, మున్నూర్ సురేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, సాయి కుమార్, అధ్యక్షులు భీమని ఆదిత్య ముదిరాజ్, సతీష్ చారి, సృజన, శివనంద్ రెడ్డి, వంశీ కృష్ణ, పురం నర్సింహ రెడ్డి, రాజేష్, మనోజ్ కుమార్, వినయ్, సంతోష్, మున్నూర్ సాయి కుమార్, సుభాష్, పవన్, రాహుల్, సుదర్శన, ఉదయ్ పాల్గొన్నారు.