నమస్తే శేరిలింగంపల్లి : సిసి రోడ్ పరిష్కారం కోసం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. అయితే అంతకంటే ముందుగా శేరిలింగంపల్లి డివిజన్ లోని టీమ్ అబొడ్ అసోసియేషన్ వారు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని వార్డు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సిసి రోడ్ సమస్య గురించి వివరించి వినతి పత్రం అందజేశారు.

అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ అసోసియేషన్ లో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్, టీమ్ అబొడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, గోపాల్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గడూరు, జనరల్ సెక్రటరీ వినోద్, సెక్రటరీ రమేష్, ట్రెజరర్ శశాంక్, కమిటీ మెంబర్స్ అరుణ్, వరుణ్, టీమ్ అబొడ్ అసోసియేషన్ మెంబెర్స్ పాల్గొన్నారు.