- శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి : భారత్ వికసిత సంకల్ప్ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి అక్కడనే లబ్దిచేకూర్చట ధ్యేయంగా లింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్న శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అధివృద్ది పథంలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలతో పేద ,మధ్యతరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారనీ అన్నారు.
మహిళల కోసం ఉజ్వల యోజన, పీఎం స్వనిధి, పేద ప్రజల ఆరోగ్యం కోసం పీఎం సురక్ష బీమా, ఆయుష్మాన్ భారత్ , చిరు వ్యాపారులు కోసం ముద్ర లోన్, చేతి వృత్తులు వారికోసం విశ్వకర్మ యోజన, ఆధార్ అప్డేట్స్ వంటి అనేక కేంద్ర పథకాలు అందరికీ అందాలనే సదుద్దేశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హత ఉన్నవారికి లబ్ధి చేకూరేలా చేయడం ఎంతో మందికి ఉపయోగకరమని అన్నారు,ఈ కార్యక్రమాన్ని అన్ని కాలనీలు, బస్తిలలో నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ రాము , డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి, రమేష్ , నరసింహ, శ్రీను, అజయ్, విజయలక్ష్మి, శ్యామ్, అఖిల్, ఆంజనేయులు, మీన, జ్యోతి, సుజాత, సుస్మిత, రాజేష్, స్వాతి, కౌసల్య, సుభాష్, కార్యకర్తలు, స్థానిక కాలనీ వాసులు, ప్రజలు పాల్గొన్నారు.