శ్రీ చైతన్య మరో రికార్డ్

  • 1 నుంచి 100 వరకు మ్యాథ్స్ టేబుల్స్
  • 100 నిమిషాల్లో అప్పజెప్పి అబ్బురపరిచిన.. ప్రైమరీ, ప్రై ప్రైమరీ విద్యార్థులు
  • వర్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు
  • అభినంచించిన పాఠశాల యాజమాన్యం
విజేతలుగా నిలిచినా చిన్నారులతో పాఠశాల బృందం

నమస్తే శేరిలింగంపల్లి: భారత విద్యారంగంలో శ్రీ చైతన్య అంటేనే ఒక సంచలనం, ఏది చేసినా విభిన్నంగా చేయడం అనుకున్న లక్ష్యాన్ని అద్భుతంగా సాధించి చరిత్ర సృష్టించడం శ్రీ చైతన్యకు అలవాటైన విద్య. ఇప్పటికే రెండు వరల్డ్ రికార్డులను సృష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నది. తాజాగా జనవరి 5న మరో ప్రపంచ రికార్డు సృష్టించి చరిత్ర తిరగరాసింది. 100 రోజుల శిక్షణతో పది రాష్ట్రాలలోని 73 బ్రాంచీల నుండి 400ల జూన్ మీటింగ్ ద్వారా 2000 కి పైగా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులు పాల్గొని ఒకటి నుంచి 100 వరకు మాథ్స్ టేబుల్ 100 నిమిషాలలోపు అప్పజెప్పి అందరిని ఆశ్చర్యపరిచి, బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించారు. ఈ కార్యక్రమాన్ని వర్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు పర్యవేక్షిస్తూ పరీక్షించి రికార్డును నమోదు చేశారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రధానం చేసి ప్రశంసించారు.
ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయడం వల్లే ఇంతటి ఘన విజయం సాధించామని, ఫలితంగా వరల్డ్ రికార్డ్ సొంతమైందని తెలిపారు. ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్థాయిల్లోని చిన్నారుల్లో దాగున్న నైపుణ్యాలను వెలికి తీయడం తమ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు పాల్గొని నాశ- ఎన్ఎస్ఎస్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లోను వరుసగా తొమ్మిదో సంవత్సరం శ్రీ చైతన్య స్కూల్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవటం శ్రీ చైతన్య స్కూల్ ఆధిపత్యానికి నిదర్శనమని తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల శాఖ మెవరిక్స్ విభాగానికి చెందిన విద్యార్థులు పాల్గొని 28 మంది విజేతలుగా నిలిచారు ఏజీఎం శివరామకృష్ణ పాల్గొన్నారు. అకాడమిక్ చీఫ్ హెడ్ పుష్పవల్లి, ప్రిన్సిపల్ రాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, ఫెసిలిటేటర్ కృషితో ఈ విజయం సాధించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.ఎస్.రావు చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు నిరంతరం కృషి చేసిన అధ్యాపక సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here