10 మినీ ఏసీ బస్సులు ప్రారంభం

  • సైబర్ టవర్స్ వద్ద ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టిఎస్‌ ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌ , ఐపీఎస్‌ అదనపు డీజీపీ, ప్రభుత్వ విప్ గాంధీ
  • హై టెక్ సిటీ, రాయదుర్గం, వేవ్ రాక్, నానక్ రాం గూడ ఐటి కారిడార్ రూట్లలో ప్రయాణం
సైబర్ టవర్స్ వద్ద ప్రారంభించిన టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టిఎస్‌ ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌ , ఐపీఎస్‌ అదనపు డీజీపీ, ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ లో సైబర్ టవర్స్ వద్ద తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టిఎస్‌ ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌ , ఐపీఎస్‌ అదనపు డీజీపీ, కార్పొరేటర్లు హామీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్ తో కలిసి సైబర్ లైనర్ టీఎస్‌ఆర్టీసీ ఫ్రీ వై ఫై తో కూడిన 10 మినీ ఏసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఐటి ఉద్యోగులకు ఈ బస్ లు ఎంతగానో తోడ్పడుతాయని, వారి కార్యాలయలకు, గమ్య స్థానాలకు చేరవేయుటలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ మినీ ఏసీ బస్సు లలో ఫ్రీ వై ఫై తో కూడిన అన్ని రకాల హంగులు, సకల సౌకర్యాలతో నేటి నుండి అందుబాటులో కి వస్తున్నాయని పేర్కొన్నారు. హై టెక్ సిటీ, రాయదుర్గం, వేవ్ రాక్, నానక్ రాం గూడ ఐటి కారిడార్ ప్రాంతములో తిరుగుతాయని వెల్లడి చేశారు. కార్యక్రమంలో చీఫ్ స్ట్రాటజీక్ ఆఫీసర్ మురళి వరద రాజన్, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ (GHZ) యాదగిరి, సెక్యూరిటీ ఫర్ సైబరబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSS) కృష్ణ యెడ్ల, మాజీ కార్పొరేటర్ మాధవర రంగరావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు బలరాం యాదవ్ పాల్గొన్నారు.

ప్రారంభించిన మినీ బస్సులో ప్రయాణిస్తున్న టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌ రెడ్డి, టిఎస్‌ ఆర్టీసీఎండీ వీసీ సజ్జనర్‌ , ఐపీఎస్‌ అదనపు డీజీపీ, ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here