నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల ఢిఫెన్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్ స్థానికంగా ప్రవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వృత్తిలో భాగంగా మూడు రోజుల క్రితం బైక్ పై వెలుతుండగా ప్రమాదంకు గురయ్యాడు. ప్రమాదంలో శ్రీకాంత్ కాలి పాదంకు తీవ్రగాయం చోటుచేసుకోవడంతో చికిత్స నిమిత్తం లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ హైద్రాబాద్ ఆద్వర్యంలో రూ. 20 వేల నగదును అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ , ఉపాద్యక్షుడు నాగరాజు, ఘాలి కృష్ణ , సురేశ్, వేణు తదితరులు పాల్గొన్నారు.