- ఘనంగా శ్రీ చైతన్య పాఠశాల స్పోర్ట్స్ డే
- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి: రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక నల్లగండ్ల శ్రీ చైతన్య పాఠశాల (సి.బి.యస్.ఇ) వద్ద స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిసిపి శిల్పవల్లి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. విశేష అతిథులుగా రీజనల్ ఇన్ చార్జి అనిత, ప్రిన్సిపల్ వాణి, జోనల్ కోఆర్డినేటర్ అన్నపూర్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, పాల్గొన్నారు. ప్రదర్శించిన వివిధ క్రీడలను వీక్షించారు.
ఈ సందర్భంగా శిల్పవల్లి మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులు విద్యతోపాటుగా క్రీడలలో నైపుణ్యం సాధించే దిశగా కృషి చేస్తుందని కొనియాడారు. మహిళల, విద్యార్థుల సేఫ్టీ గురించిన సేఫ్టీ క్లబ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. తదుపరి కార్యక్రమంలో విశేష అతిథిగా పాల్గొన్న రీజనల్ ఇన్ చార్జి అనిత మాట్లాడుతూ విద్యార్థులు ఆట స్థలమందు సాయంత్రం సమయంలో ఆటలు ఆడాలని హితవు పలికారు. తరువాత పాఠశాల ప్రిన్సిపల్ వాణి మాట్లాడుతూ విద్యార్థులను బహుముఖ ప్రజ్ఞావంతులుగా చేయడమే శ్రీ చైతన్య విద్యాసంస్థల లక్ష్యమని చెప్పారు. వివిధ క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులను కొనియాడారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం వల్ల మాత్రమే ఈ కార్యక్రమం విజయవంతమైందని వివరించారు.
ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఆటలతో పాట, డంబుల్ డ్రిల్, వేన్స్ డ్రిల్, పిరమిడ్స్, దాండియా, శంభోశివశంభో, హోలాహోబ్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో చివరిగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో అకడమిక్ డీన్ కోటేశ్వరరావు, ప్రైమరీ ఇన్ ఛార్జ్ అమల, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.