సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం : కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి  

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అక్కడ పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచినీళ్లకు ఇబ్బంది పడుతున్నామని, మురుగు నీటి కాలువ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన దృష్టికి తెచ్చారు.

టెలికాంనగర్ లో పర్యటిస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

మురుగు కాల్వలో శుభ్రం చెయ్యకపోవటం వల్ల తరచూ అనారోగ్యపాలు కావాల్సి వస్తోందని కాలనీ వాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులకు స్వచ్ఛమైన మంజీరా నీటిని అందించాలనే లక్ష్యంతో నూతనంగా పైపు లైనుల ఏర్పాటు చేయాలని హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డిని కోరారు. అనంతరం జీహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి కావాల్సిన తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు రంగస్వామి ముదిరాజ్, రాజు టెలికాంనగర్ కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here