ఎస్ ఆర్ హెచ్ సెలూన్ 5వ బ్రాంచ్ ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి స్ట్రీట్ నెం. 2 వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్ఆర్ హెచ్ సెలూన్ 5వ బ్రాంచ్ ను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాదాసు రమేష్, ఉపేందర్ ను అభినందించారు. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, నయీమ్, విజయ్, అలీం, నర్సింహా, నిర్వాహకులు వారి కుటుంబసభ్యులు, సెలూన్ స్టాఫ్ పాల్గొన్నారు.

ఎస్ ఆర్ హెచ్ సెలూన్ 5వ బ్రాంచ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here