సంక్షేమ పథకాలను గడప గడపకూ చేరవేయాలి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ కార్యకర్తలతో అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో హుడా కాలనీలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ బండి రమేష్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, హఫీజ్ పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొని కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే, కార్పొరేటర్ హఫీజ్ పెట్ డివిజన్ బస్తి/కాలనీలో కొంతమేర మిగిలి ఉన్న అభివృద్ధి పనులపై చర్చించారు.

ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు

అనంతరం గత తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్ర నివేదిక ప్రజల ముందు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముకగా నిలుస్తున్నారని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సమాయత్తం కావాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ బస్తి అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

భోజనం వడ్డిస్తూ ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here