- అధ్యక్షుడిగా పి.గోవర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.మల్లేశ్, ప్రధాన కార్యదర్శిగా తాండ్ర రమేష్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గోవర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి. మల్లేశ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిని చేసినందుకు ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. బార్ సభ్యులకు అండగా ఉంటానని, వారి అభ్యున్నతికి పాటుపడతానని, ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ అభివృద్ధే లక్ష్యమని, బార్ సభ్యులు సహకారంతో ఆ దిశగా అడుగులు వేస్తానని తెలిపారు.
- కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా గోవర్దన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా డి.మల్లేశ్, జనరల్ సెక్రటరీగా తాండ్ర రమేశ్ గౌడ్, జాయింట్ సెక్రటరీగా హరీశ్ శంకర్ రెడ్డి, ట్రెజరర్ గా డి.రాజు, లైబ్రరీ సెక్రటరీ హర్షవర్ధన్ రెడ్డి, స్పోర్ట్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పి.మధుసూదన్ ఎన్నిక కాగా.. లేడీ సెక్రటరీ జి.శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కె.శివకృష్ణ, జి. జ్యోత్స్న, జి.చంద్రశేఖర్, వి.శ్వేతకుమారి, కె.గోపాల్ రెడ్డి, రక్తపు శేేఖర్ గౌడ్, ఎస్.బాలాపీర్, పి.విజయ్ కుమార్, బి.నరేష్ కుమార్ ఎన్నికయ్యారు.
- కూకట్ పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల వివరాలు..
అధ్యక్షుడి హోదాకు.. గోవర్దన్ రెడ్డి కి 155 ఓట్లు, నవనీతరావు 121, పి. పరమేశ్ 91, జాకీర్ హుస్సేన్ 81 ఓట్లు పోలయ్యాయి. గోవర్దన్ రెడ్డికి 34 ఓట్లు ఎక్కువ రావడంతో అధ్యక్షుడి పీఠం ఎక్కారు. డి. మల్లేశ్ కు 242 ఓట్లు రావడంతో ఉపాధ్యక్షుడి పీఠం దక్కించుకున్నారు. గుర్రం వేణుగోపాల్ రెడ్డి 115, కె. కృష్ణవేణి 81 ఓట్లతో సరిపెట్టుకున్నారు. టి. రమేశ్ 231 ఓట్లు రావడంతో జనరల్ సెక్రటరీగా గెలుపొందగా.. సి. శ్రీకాంత్ 179, ఎం. శంకర్ 35 ఓట్లతో వెనుకపడ్డారు. జాయింట్ సెక్రటరీగా హరీశ్ శంకర్ రెడ్డి 171 ఓట్లు సాధించగా.. పి. నటరాజ్ 168, కె. శ్రీనివాస్ సింగ్ 99కు ఓట్లతో నిరాశే ఎదురైంది. ట్రెజరర్ గా డి. రాజు 234 ఓట్లు పడడంతో .. 34 ఓట్ల తేడాతో భీమయ్యకు ఓటమి ఎదురైంది. లైబ్రరీ సెక్రటరీగా హర్షవర్ధన్ రెడ్డి 239 ఓట్లు సాధించగా.. పి. సంతోశ్ కుమారి 146, ఎ. శ్రీరాములు 64 ఓట్లతో సరిపెట్టుకున్నారు. స్పోర్ట్ అండ్ కల్చరల్ సెక్రటరీగా పి. మధుసూదన్ 228 ఓట్లు పడగా.. ఎం.వి.వి. అరుణ కుమార్ 220ఓట్లు పడ్డాయి. లేడీ సెక్రటరీ జి. శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్
కె.శివకృష్ణ 267, జి.జ్యోత్స్న 258, జి.చంద్రశేఖర్ 244, వి. శ్వేతకుమారి 242, కె.గోపాల్ రెడ్డి 238, రక్తపు శేఖర్ గౌడ్ 220, ఎస్.బాలాపీర్ 216, పి.విజయ్ కుమార్ 210, బి.నరేష్ కుమార్ 190 ఓట్లతో ఎన్నికయ్యారు.