క్రీడలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

  • ఘనంగా అజాది కా ఖేల్ మహోత్సవం (స్పోర్ట్ మీట్ 2022)
  • 25 వరకు చందానగర్ డివిజన్ పరిధిలోని PJR స్టేడియంలో కార్యక్రమాలు
  • కార్యక్రమంను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, DEO సుశీందర్ రావు, MEO వెంకటయ్యతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ ఆధ్వర్యంలో అజాది కా ఖేల్ మహోత్సవం (స్పోర్ట్స్ మీట్) నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పిల్లలలో దాగిన సృజనాత్మకతను వెలికి తీయటానికి ఎంతగానో దోహదపడుతుందని, పిల్లలకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో ముఖ్యమని, వీటితో శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. పిల్లలు చదువులతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుడే మంచి భావి పౌరులుగా దేశానికి సేవలు అందిస్తారని పేర్కొన్నారు. విద్య, అభివృద్ధి కి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వివరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు ఓ. వెంకటేష్, నరేందర్ బల్లా, వరలక్ష్మి రెడ్డి, రాజశేఖర్ , వాసు, శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు గాయం భీష్మారెడ్డి, కాకరపర్తి శ్రీనివాస్, కార్యదర్శి విజయకుమార్, కోశాధికారి లయన్, డా.బోరుసు వెంకటేశ్వర రావు, సలహాదారులు, అనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్.ఎన్. రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, అరుకుల రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహకుడు, ఎస్.రాజేశ్వర రావు, ఉపాధ్యక్షుడు, ఆచర్య, నోవా, ఫణి కుమార్, సైమన్, శ్రీనివాస్ రెడ్డి, పవన్, మధు బాబు, ప్రవీణ్, రత్న కుమారి, విజయ్ కుమార్, సుజీవన్ బాబు, యాంకర్ దివాకర్, నిజాం అలీ ఖాన్, భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి, సుధాకర్, రెహ్మాన్, ఇక్బాల్, పాఠశాలల యాజమాన్యం, PET లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అజాది కా ఖేల్ మహోత్సవం (స్పోర్ట్ మీట్ 2022)ను కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, DEO సుశీందర్ రావు, MEO వెంకటయ్యతో కలిసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
బ్యాట్ చేత బట్టి పోటీలను ప్రారంభించిన గాంధీ
పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here