బిజెపిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్నె సురేష్ ముదిరాజ్ చేరిక

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్ సమక్షంలో మియాపూర్ డివిజన్ మన్నే సురేష్ ముదిరాజు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో కలిసి పనిచేయడం.. రవికుమార్ యాదవ్ నాయకత్వంలో తిరిగి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బిజెపి పార్టీని గెలిపించుకోవడానికి నా శాయశక్తులా కృషి చేసి ముదిరాజ్ కమ్యూనిటీ మొత్తం బిజెపి వైపు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ రోజురోజుకు నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తున్నదని, కొద్ది రోజుల్లో ముదిరాజ్, గౌడ, యాదవ సోదరులు పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లేష్, ఆకుల లక్ష్మణ్, గణేష్ ముదిరాజ్ , మల్లేష్ శీను, రాము, చంద్రమాసిరెడ్డి, బాలాజీ పాల్గొన్నారు.

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యుడు బిక్షపతి యాదవ్, రవి కుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here