నమస్తే శేరిలింగంపల్లి: యువతి రోడ్డు దాటుతుండగా ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేందర్ కథనం ప్రకారం.. ఐ డీఎ బొల్లారం గాంధీ నగర్ లో నివాసం ఉంటున్న నర్సింలు, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. ఒక కుమారుడు ఉన్నారు.పెద్ద కూతురు లావణ్య (22) మియాపూర్ మదినాగుడా లోని భద్ర డయాస్టిక్స్ లో పనిచేస్తుండగా తండ్రి నర్సింలు ఆర్టీసి డ్రైవర్ గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లావణ్య శుక్రవారము ఉదయం షిఫ్ట్ లో భాగంగా 7 గం ల నుంచి మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించింది. 4 సమయంలో మధినగుడాలోని విజేత మార్కెట్ ముందు మియాపూర్ మైత్రి కమాన్ వైపు పాదచారులు రోడ్డు దాటేందుకు వదిలన డివైడర్ మధ్యలో నుంచి జాతీయ రహదారి అవతల వైపు దాతుతుండగా చంధానగర్ నుండి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న గుర్తు తెలియని ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టింది. లావణ్య ఎగిరి అదే సమయంలో మేడ్చల్ డిపోకు చెందిన మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు పఠాన్ చెరువు నుండి మియాపూర్ వైపు వెళ్తున్న బస్సు ఏపి 11 జెడ్ 7518 చక్రాల కింద పడింది. దీంతో లావణ్య ఘటన స్థలంలోనే మృతి చెందింది. ఢీ కొట్టిన వాహనదారున్ని పోలీసులు గుర్తించలేదు. తండ్రి నర్సింలు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.