నమస్తే శేరిలింగంపల్లి: సురభి కాలనీలోని ప్రభుత్వ ఆంగ్ల మాద్యమ పాఠశాలలో చైల్డ్ ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో smc విది విధానాల గురించి కార్యక్రమ నిర్వహించారు. హఫీజ్ పేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్య నిర్వహణ గురించి సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యను బోధిస్తారని, బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బసవరాజు లింగాయత్, వార్డ్ మెంబర్ శ్రీకల, ప్రధానోపాధ్యాయులు గంగాధర్ రావు, ఇన్ ఛార్జ్ హెచ్ఎం దేవదాసు, చైల్డ్ ఫండ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ గ్రేసీ, ఎస్ఆర్పి భాగ్యమ్మ, ఉపాధ్యాయులు అష్రఫ్, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలనీవాసులు పాల్గొన్నారు.