నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత నిస్తూ, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ కుమ్మరి బస్తీలో రూ. 23 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక నాయకులతో కలసి పర్యవేక్షించారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పాదయాత్ర చేసి ప్రజలను కలసి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గాంధీ సహకారంతో కొండాపూర్ డివిజన్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరం అయిన రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులపై దృష్టి సారించి పనులు చేబడుతున్నామన్నారు. కార్యక్రమంలో తెరాస నాయకులు బద్దం శాస్త్రి యాదవ్, మల్లెల శ్రవణ్ యాదవ్, మల్లెల రాజు యాదవ్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, సిల్వర్ సంధ్య, మల్లెల పవన్ యాదవ్, వర్క్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, వాటర్ వర్క్స్ టెక్నికల్ ఆఫీసర్ నాయుడు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.