నమస్తే శేరిలింగంపల్లి: జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్గా కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలా మూడు నెలల పాటు వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను ఆమె స్థానంలో జూలై 25 వరకు ఫుల్ అడిషనల్ చార్జ్(FAC) అప్పగిస్తూ నిర్వహించాలంటూ జిహెచ్ఎంసి చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సోమవారం నాడు మమత భాద్యతలు స్వీకరించనున్నట్టు “నమస్తే శేరిలింగంపల్లి” కి వివరించారు.