నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపినగర్, బాపునగర్ లో మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు, అంతర్గత రోడ్లు సమస్యలపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. అనంతరం గోపినగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో స్థానిక నాయకులు, బస్తివాసులతో కలిసి మొక్కలను నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని రాగం నాగేందర్ యాదవ్ సూచించారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట డీఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, వాటర్ వర్క్స్ అధికారి యాదగిరి, ఎలక్ట్రికల్ ఏఈ రవిచంద్ర,వర్క్ ఇన్ స్పెక్టర్లు మహేష్, యాదగిరి, ఎస్ ఆర్ పీ బాలరాజ్, ఎస్ ఎఫ్ ఏ బిక్షపతి తో పాటు వార్డు మెంబర్ ఫర్వీన్, గోపినగర్ కాలనీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, నెహ్రూనగర్ బస్తి కమిటీ అద్యక్షలు డి శ్రీకాంత్, యూత్ ప్రెసిడెంట్ మహేందర్ సింగ్, కలివేముల వీరేశం గౌడ్, సత్యనారాయణగౌడ్, గణపురం రవీందర్, దిన్నుసింగ్, ప్రభాకర్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, బృంగి సుమన్, రాజ్ కుమార్, నర్సింహా, సైదులు, ప్రభాకర్ గౌడ్,సాయి,ముంతాజ్ బేగం,కృష్ణ,శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.